'దేవ‌ర' సునామీ.. 3 రోజుల్లోనే రూ.304 కోట్లు
Add ap7am to your home Screen

'దేవ‌ర' సునామీ.. 3 రోజుల్లోనే రూ.304 కోట్లు

Devara Movie Collects Rs 304 Crore in 3 Days
  • ఎన్‌టీఆర్‌, కొరటాల శివ కాంబోలో 'దేవర' 
  • ఈ నెల 27న వ‌ర‌ల్డ్‌వైడ్‌గా రిలీజైన సినిమా
  • మొద‌టి రోజే రూ.172కోట్ల రికార్డుస్థాయి క‌లెక్ష‌న్స్‌
గ్లోబల్ స్టార్‌ ఎన్‌టీఆర్, ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు కొర‌టాల శివ కాంబినేష‌న్‌లో వ‌చ్చిన దేవ‌ర భారీ వ‌సూళ్ల‌తో దూసుకెళ్తోంది. ప్ర‌పంచ‌వ్యాప్తంగా మూడు రోజుల్లోనే ఈ మూవీ రూ.304 కోట్లు వ‌సూలు చేసిన‌ట్లు తాజాగా మేక‌ర్స్ ప్ర‌క‌టించారు. 

ఇక మొద‌టి రోజే దేవ‌ర ఏకంగా రూ.172 కోట్లు కొల్ల‌గొట్టిన విష‌యం తెలిసిందే. మొద‌టి ఆట నుంచే పాజిటివ్ టాక్ రావ‌డంతో మూవీ క‌లెక్ష‌న్స్ స్ట‌డీగా కొన‌సాగుతున్నట్లు ట్రేడ్ వ‌ర్గాలు వెల్ల‌డించారు. మ‌రో వారంలో రూ.500కోట్ల మార్క్‌ను చేరుకోవ‌చ్చ‌ని అంచ‌నా వేస్తున్నాయి.

కాగా, ఈ సినిమాలో తార‌క్ స‌ర‌స‌న తొలిసారి బాలీవుడ్ బ్యూటీ జాన్వీ క‌పూర్ హీరోయిన్‌గా నటించింది. అలాగే మ‌రో బాలీవుడ్ స్టార్‌ సైఫ్‌ అలీఖాన్ ప్ర‌తినాయ‌కుడిగా క‌నిపించారు. 

ప్రకాశ్ రాజ్‌, శ్రీకాంత్‌, మురళీ శర్మ, మలయాళ న‌టుడు షైన్ టామ్ ఛాకో త‌దిత‌రులు ఇతర కీలక పాత్రల్లో మెరిశారు. ఎన్టీఆర్ ఆర్ట్స్, యువ‌సుధ ఆర్ట్స్ బ్యానర్ సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రానికి అనిరుధ్ ర‌విచంద‌ర్ సంగీతం అందించారు.
Advertisement
Devara
Jr NTR
Tollywood

More Telugu News