Devara: కొనసాగుతున్న దేవర వసూళ్లు.. రెండు రోజుల్లో ఏపీలో కలెక్ట్ చేసింది ఎంతంటే?

NTR Devara Movie Two Days Collections Here
షార్ట్స్‌లో చూడండి
ఎన్టీఆర్, కొరటాల శివ కాంబినేషన్‌లో  వచ్చిన మూవీ దేవర. బాలీవుడ్ నటి జాన్వీకపూర్ హీరోయిన్‌గా నటించిన ఈ మూవీ ఈ నెల 27న ఆడియన్స్ ముందుకొచ్చింది. విడుదలకు ముందే దేశవిదేశాల్లో మంచి హైప్ క్రియేట్ చేసిన దేవర.. పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. తొలి రోజు మంచివసూలు సాధించిన ఈ సినిమా రెండో రోజు కూడా కలెక్షన్లలో హవా కొనసాగింది. రెండు రోజుల్లో  తెలుగు రాష్ట్రాల్లో ఏకంగా రూ. 70.33 కోట్లు వసూలు చేసిందని చెబుతున్నారు మేకర్స్‌. రెండో రోజు వసూళ్లను చిత్ర నిర్మాతలు అధికారికంగా ప్రకటించారు. ఆ వివరాలివి. 

తొలి రోజు నైజాలో రూ. 6.94 కోట్లు, సీడెడ్‌లో రూ. 3.77 కోట్లు, వైజాగ్‌లో రూ. 1.68 కోట్లు, తూర్పు గోదావరి జిల్లాలో రూ. 0.86 కోట్లు, పశ్చిమ గోదావరిలో రూ. 0.48 కోట్లు, కృష్ణాలో రూ. 0.95 కోట్లు, గుంటూరులో రూ. 0.82 కోట్లు, నెల్లూరులో రూ. 0.62 కోట్లు వసూలు చేసింది. 

ఇక రెండు రోజుల కలెక్షన్లు చూసుకుంటే  నైజాంలో రూ. 26.26 కోట్లు, సీడెడ్‌లో రూ. 14.17 కోట్లు, వైజాగ్‌లో రూ. 7.15 కోట్లు, తూర్పు గోదావరిలో రూ. 4.88 కోట్లు, పశ్చిమ గోదావరిలో రూ. 4.08 కోట్లు, కృష్ణాలో రూ. 3.97, గుంటూరులో రూ. 7.09 కోట్లు కలిపి మొత్తంగా రూ. 70.33 కోట్లు వసూలు చేసింది.
Go Back to Shorts
Devara
Junior NTR
Koratala Siva
Janvi Kapoor
Tollywood

More Telugu News