ఫ్యామిలీతో క‌లిసి 'దేవ‌ర' మూవీ చూసిన జ‌క్క‌న్న.. ఇదిగో వీడియో!
Add ap7am to your home Screen

ఫ్యామిలీతో క‌లిసి 'దేవ‌ర' మూవీ చూసిన జ‌క్క‌న్న.. ఇదిగో వీడియో!

Director SS Rajamouli Watches Devara Movies With His Family
  • నేడు ప్ర‌పంచ‌వ్యాప్తంగా విడుద‌లైన 'దేవ‌ర‌'
  • మూవీకి పాజిటివ్ టాక్‌
  • థియేట‌ర్ల వ‌ద్ద పండ‌గ వాతావ‌ర‌ణం
  • బాలానగర్‌లోని మైత్రి విమల్‌ థియేటర్‌లో సినిమా చూసిన రాజ‌మౌళి
రెండు తెలుగు రాష్ట్రాల్లో సినిమా థియేటర్ల వద్ద 'దేవ‌ర' కోలాహ‌లం కొన‌సాగుతోంది. మూవీకి పాజిటివ్ టాక్ రావ‌డంతో ఎన్‌టీఆర్ ఫ్యాన్స్ పండ‌గ చేసుకుంటున్నారు. 'ఆర్‌ఆర్‌ఆర్' వంటి బ్లాక్‌బస్టర్‌ తర్వాత 'దేవర'తో తార‌క్‌ ప్రేక్షకుల ముందుకు వచ్చిన విష‌యం తెలిసిందే. దాదాపు ఆరేళ్ల‌ తర్వాత త‌మ అభిమాన హీరో సోలోగా నటించిన చిత్రం థియేట‌ర్ల‌కు రావడంతో అభిమానుల ఆనందానికి అవ‌ధుల్లేవు. 

దీంతో సినిమా థియేట‌ర్ల‌ వద్ద పండగ వాతావరణం నెలకొంది. ఈ క్ర‌మంలో అభిమానులతో పాటు ప్రముఖులు కూడా మూవీని వీక్షిస్తున్నారు. తాజాగా ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు ఎస్‌ఎస్‌ రాజమౌళి తన ఫ్యామిలీతో కలిసి సినిమా చూశారు. 

బాలానగర్‌లోని మైత్రి విమల్‌ థియేటర్‌కు భార్య ర‌మ‌, కుమారుడు కార్తీకేయ‌, కోడ‌లు, ఇత‌ర కుటుంబ స‌భ్యుల‌తో క‌లిసి వచ్చారు. అనంత‌రం సినిమా హాల్లో మిగ‌తా ప్రేక్ష‌కుల‌ను విష్ చేశారు. వారితో కలిసి మూవీ వీక్షించారు. 

ప్రస్తుతం రాజ‌మౌళి దేవర వీక్షించిన వీడియోలు సామాజిక మాధ్య‌మాల్లో వైరల్ అవుతున్నాయి. అలాగే ప్రముఖ నిర్మాత దిల్‌రాజు, దర్శకుడు అనిల్‌ రావిపూడి మూసాపేట్ లోని శ్రీరాములు థియేటర్‌లో ఈ సినిమాను చూశారు.
Advertisement
Devara
SS Rajamouli
Tollywood
Jr NTR

More Telugu News