తమిళ దర్శకుడితో సినిమా చేసేందుకు ఎన్టీఆర్ ఆసక్తి
Add ap7am to your home Screen

తమిళ దర్శకుడితో సినిమా చేసేందుకు ఎన్టీఆర్ ఆసక్తి

ntr speech at devara press meet in chennai
  • చెన్నైలో ప్రెస్ మీట్ నిర్వహించిన దేవర టీమ్ 
  • తెలుగు సినీ పరిశ్రమకు తొలి అడుగు పడింది చెన్నైలోనేనని పేర్కొన్న ఎన్టీఆర్
  • తమిళ్ లో సైతం తనకు ఒక సినిమా చేయాలని వెట్రిమారన్‌‌ను కోరిన ఎన్టీఆర్
తమిళ దర్శకుడితో సినిమా చేయాలన్న ఆసక్తిని ఎన్టీఆర్ వ్యక్తం చేశారు. ఎన్టీఆర్ హీరోగా తెరకెక్కిన దేవర సినిమా ఈ నెల 27వ తేదీ విడుదల కానుంది. ఈ నేపథ్యంలో మంగళవారం చెన్నైలో నిర్వహించిన ప్రెస్ మీట్‌లో దేవర టీమ్ పాల్గొంది. ఈ సందర్భంగా ఎన్టీఆర్ మాట్లాడుతూ.. దేవర సినిమాకు పని చేసిన వారి కష్టాన్ని ఎప్పటికీ మర్చిపోనన్నారు. ఈ సినిమా అందరికీ ప్రత్యేకమేనని చెప్పారు. చెన్నై అంటే తనకు ఎంతో ప్రత్యేకమని అన్నారు. బాల్యంలో కూచిపూడి నృత్యం ఇక్కడే నేర్చుకున్నానని గుర్తు చేసుకున్నారు. దేవరకు మూలస్తంభాలైన (దర్శకుడు, సినిమాటో గ్రాఫర్ తదితరులు) వారితో వేదిక పంచుకోవడం సంతోషంగా ఉందన్నారు. ఈ సినిమాలో జాన్వీ కపూర్ అధ్భుతంగా నటించారని ప్రశంసించారు. 

మన భాషలు వేరు కావొచ్చు కానీ మనందరినీ ఒక్కటిగా చేసింది సినిమానే అన్నారు. కోలీవుడ్, టాలీవుడ్, శాండిల్‌వుడ్ అనేవి పేరుకు మాత్రమేనని, ప్రేక్షకులంతా ఒక్కటేనని బాక్సాఫీసు వద్ద ఎన్నో సినిమాలు నిరూపించాయన్నారు. తెలుగు సినీ పరిశ్రమకు తొలి అడుగు పడింది చెన్నైలోనేనని అన్నారు. సినిమా ప్రమోషన్స్‌కు చెన్నై కూడా కీలకంగా మారిందన్నారు. 'వెట్రిమారన్ సర్ .. తమిళ్‌లో సైతం నాకు ఒక సినిమా చేయండి, మేము దాన్ని తెలుగులోకి డబ్ చేసుకుంటాం' అని వేదికపై వున్న తమిళ దర్శకుడు వెట్రిమారన్ పై ఎన్టీఆర్ తన అభిమానాన్ని చాటుకున్నారు.
Advertisement
NTR
Movie News
Devara movie

More Telugu News