విశాఖ నుంచి చత్తీస్‌గఢ్ వెళ్తున్న వందేభారత్ రైలుపై రాళ్లదాడి.. మూడు కోచ్‌ల అద్దాలు ధ్వంసం
- ప్రధాని నేడు ప్రారంభించాల్సిన రైలుపై రాళ్లదాడి
- ఐదుగురు నిందితుల అరెస్ట్
- చత్తీస్‌గఢ్‌లోని దుర్గ్-విశాఖ మధ్య పరుగులు పెట్టనున్న వందేభారత్ రైలు
- బగ్‌బహరా రైల్వే స్టేషన్ వద్ద దాడి
- నేడు మరికొన్ని రైళ్లను ప్రారంభించనున్న మోదీ
ఈ రైలుతోపాటు దేశంలోని తొలి వందేభారత్ మెట్రో రైలును కూడా మోదీ ప్రారంభించనున్నారు. ఇది గుజరాత్‌లోని భుజ్ నుంచి అహ్మదాబాద్ మధ్య నడవనుంది. అలాగే, 20 కోచ్‌లతో వారణాసి-ఢిల్లీ మధ్య పరుగులు పెట్టనున్న తొలి 20 కోచ్‌ల వందేభారత్ రైలును కూడా మోదీ నేడు ప్రారంభిస్తారు. అలాగే, టాటానగర్-పాట్నా, నాగ్‌పూర్-సికింద్రాబాద్, కొల్హాపూర్-పూణె, ఆగ్రా కంటోన్మెంట్-బెనారస్, పూణె-హుబ్బళ్లి మధ్య నడిచే వందేభారత్ రైళ్లను మోదీ ప్రారంభిస్తారు.