Jagan: ప్రజలు మనవైపే ఉన్నారనే విశ్వాసం నాకు ఉంది: పులివెందులలో జగన్
పులివెందుల పర్యటనలో ఉన్న వైసీపీ అధినేత జగన్ ఈరోజు పార్టీ శ్రేణులతో మమేకమయ్యారు. పులివెందులలోని భాకరాపురంలో ఉన్న క్యాంపు కార్యాలయంలో పార్టీ నేతలు, కార్యకర్తలు, అభిమానులను కలిశారు. అందరినీ పేరుపేరునా పలకరించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... ఎవరూ అధైర్య పడొద్దని, అందరికీ పార్టీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. ఐదేళ్ల పాలనలో మనం అన్నీ మంచి పనులు చేశామని... మనం చేసిన మంచి ప్రతి కుటుంబంలో ఉందని చెప్పారు.
ప్రజలు మనవైపే ఉన్నారనే విశ్వాసం తనకు ఉందని అన్నారు. ప్రభుత్వ తప్పిదాలను ఎత్తిచూపుతూ, ప్రజల సంక్షేమం కోసం పోరాటం చేద్దామని చెప్పారు. కార్యకర్తలకు అండగా నేతలు నిలబడాలని పిలుపునిచ్చారు.