Stock Market: లాభాల్లో ముగిసిన భారత స్టాక్ మార్కెట్లు

Sensex extends upmove to 3rd day
షార్ట్స్‌లో చూడండి
దేశీయ స్టాక్ మార్కెట్లు గురువారం నాడు లాభాల్లో ముగిశాయి. సెన్సెక్స్ 147 పాయింట్లు లాభపడి 81,053 వద్ద ముగియగా, నిఫ్టీ 41 పాయింట్లు ఎగిసి 24,811 వద్ద స్థిరపడింది. సెన్సెక్స్-30 స్టాక్స్‌లో 18 లాభాల్లో ముగియగా, 12 నష్టాల్లో ముగిశాయి. 

భారతీ ఎయిర్‌టెల్, టాటా స్టీల్, ఐడీబీఐ బ్యాంకు, టైటాన్ టాప్ గెయినర్స్‌గా ఉండగా... మహీంద్రా అండ్ మహీంద్రా, ఎన్టీపీసీ, టాటా మోటార్స్ టాప్ లూజర్స్‌గా నిలిచాయి. డాలర్ మారకంతో రూపాయి 4 పైసలు క్షీణించి రూ.83.94 వద్ద ముగిసింది.

బ్యాంకులు, ఎఫ్ఎంసీజీ, రియాల్టీ స్టాక్స్ మంచి లాభాల్లో ముగిశాయి. ఆటో, ఫార్మా, ఐటీ, మీడియా రంగాలు మాత్రం నష్టాల్లో ముగిశాయి. మిగతా స్టాక్స్ సానుకూలంగా ముగిశాయి. అదానీ పవర్, అంబుజా సిమెంట్స్‌లో 5 శాతం వాటాను విక్రయించేందుకు అదానీ గ్రూప్ చూస్తోందనే వార్తల నేపథ్యంలో ఈ స్టాక్స్ 3 శాతం మేర క్షీణించాయి.

12 నెలలకు సంబంధించి అమెరికా జాబ్ డేటా సానుకూలంగా నమోదైంది. అంచనాల కంటే అదనపు ఉద్యోగాల సృష్టి జరిగింది. వచ్చే నెలలో ఫెడ్ రిజర్వ్ వడ్డీ రేట్లు తగ్గించేందుకు ఈ జాబ్ డేటాను ఓ సూచనగా భావిస్తున్నారు. దీనికి తోడు అంతర్జాతీయ మార్కెట్లు సానుకూలంగా ఉండటంతో భారత స్టాక్ మార్కెట్లు వరుసగా లాభాల్లో ముగుస్తున్నాయి.
Go Back to Shorts
Stock Market
Share Market
Nifty
Sensex

More Telugu News