సాయంత్రం 4.05 గంట‌ల‌కు 'దేవ‌ర' బిగ్ అప్‌డేట్‌
Add ap7am to your home Screen

సాయంత్రం 4.05 గంట‌ల‌కు 'దేవ‌ర' బిగ్ అప్‌డేట్‌

Big Update from Devara Movie Today
  • ఎన్‌టీఆర్, కొర‌టాల శివ కాంబినేష‌న్‌లో 'దేవ‌ర‌'
  • మూవీలో విల‌న్‌గా బాలీవుడ్ న‌టుడు సైఫ్ అలీఖాన్
  • ఆయ‌న బ‌ర్త్‌డే సంద‌ర్భంగా గ్లింప్స్ వీడియోను విడుద‌ల చేస్తామన్న మేక‌ర్స్‌ 
  • సెప్టెంబ‌ర్ 27న ప్రేక్షకుల ముందుకు రానున్న మూవీ
యంగ్ టైగ‌ర్ ఎన్‌టీఆర్, టాలెంటెడ్ డైరెక్ట‌ర్ కొర‌టాల శివ కాంబినేష‌న్‌లో వ‌స్తున్న తాజా చిత్రం దేవ‌ర‌. రెండు పార్టులుగా తెర‌కెక్కుతున్న ఈ మూవీ పార్ట్‌-1 సెప్టెంబ‌ర్ 27న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్ప‌టికే విడుద‌లైన మూవీ గ్లింప్స్‌, సాంగ్స్, పోస్ట‌ర్స్ చిత్రంపై భారీ అంచ‌నాలు నెల‌కొల్పాయి. అలాగే ఇదే కాంబోలో ఇంత‌కుముందు వ‌చ్చిన జ‌న‌తా గ్యారేజ్ సూప‌ర్ హిట్ కావ‌డం కూడా దేవ‌ర‌పై అంచ‌నాల‌ను పెంచేసింది. 

ఇక ఈ మూవీలో బాలీవుడ్ న‌టుడు సైఫ్ అలీఖాన్ ప్ర‌తినాయ‌కుడిగా క‌నిపించ‌నున్నాడు. ఆయ‌న పుట్టినరోజు సంద‌ర్భంగా ఇవాళ సాయంత్రం 4.05 గంట‌ల‌కు మేక‌ర్స్ మూవీ నుంచి అప్‌డేట్ ఉంటుంద‌ని ప్ర‌క‌టించారు. భైర‌వకు సంబంధించిన గ్లింప్స్ వీడియోను విడుద‌ల చేస్తామంటూ ఓ పోస్ట‌ర్‌ను రిలీజ్ చేశారు. 

కాగా, సినిమాలో తార‌క్ స‌ర‌స‌న క‌థ‌నాయిక‌గా బాలీవుడ్ బ్యూటీ జాన్వీ క‌పూర్ న‌టిస్తోంది. త‌మిళ యువ సంగీత ద‌ర్శ‌కుడు అనిరుధ్ ర‌విచంద‌ర్ బాణీలు అందించాడు.
Advertisement
Devara
Jr NTR
Koratala Siva
Tollywood
Saif Ali Khan

More Telugu News