బీజేపీ ఎంపీ కంగన రనౌత్‌కు హిమాచల్ ప్రదేశ్ హైకోర్టు నోటీసులు.. వివరణకు ఆగస్టు 21 వరకు గడువు
- మండి నుంచి లోక్‌సభ ఎన్నికల బరిలోకి నిలిచిన లాయక్‌రామ్ నేగి
- రిటర్నింగ్ అధికారి తన నామినేషన్ పత్రాలను అకారణంగా తిరస్కరించారని ఆరోపణ
- తాను బరిలో ఉండి ఉంటే తప్పకుండా గెలిచి ఉండేవాడినన్న నేగి
- ఎన్నికను రద్దు చేయాలంటూ పిటిషన్
అటవీ విభాగంలో పనిచేసిన నేగి ఎన్నికల బరిలోకి దిగేందుకు ముందస్తుగా ఉద్యోగ విరమణ చేశారు. ఆ తర్వాత నామినేషన్ పత్రాలతోపాటు డిపార్ట్మెంట్ ఇచ్చిన ‘నో డ్యూ’ సర్టిఫికెట్‌ను కూడా జతచేశారు. అయితే, విద్యుత్, తాగునీరు, టెలిఫోన్ విభాగాల నుంచి కూడా సర్టిఫికెట్లు తీసుకురావాలని చెబుతూ రిటర్నింగ్ అధికారి ఒక రోజు గడువిచ్చారు.
ఆ లోపే తాను వాటిని తీసుకెళ్లానని, కానీ రిటర్నింగ్ అధికారి వాటిని తీసుకునేందుకు నిరాకరించారని నేగి తన పిటిషన్లో ఆరోపించారు. ఆ రోజు తన నామినేషన్ పత్రాలను అంగీకరించి ఉంటే ఆ ఎన్నికల్లో తాను తప్పకుండా గెలిచి ఉండేవాడినని, కాబట్టి ఈ ఎన్నికను రద్దు చేయాలని నేగి కోర్టును అభ్యర్థించారు. కాగా, ఈ ఎన్నికల్లో బీజేపీ తరపున బరిలోకి దిగిన కంగన రనౌత్ మండిలో కాంగ్రెస్ అభ్యర్థి విక్రమాదిత్య సింగ్‌పై 74,755 ఓట్లతో విజయం సాధించారు.