జోరు వానలోనూ చంద్రబాబు ర్యాలీలో తెలంగాణ కార్యకర్తల ఉత్సాహం... ఫొటోలు ఇవిగో!
- భారీ వర్షాన్ని లెక్కచేయకుండా బాబు కోసం ఎదురుచూసిన అభిమానులు
- డప్పులు, కళాకారుల విన్యాసాలతో ర్యాలీగా ఇంటికి చేరిన చంద్రబాబు
- నగరంలో పలుచోట్ల స్వాగత ఫ్లెక్సీల ఏర్పాటు
హైదరాబాద్‌లో ఓ వైపు భారీ వర్షం కురుస్తున్నప్పటికీ టీడీపీ కార్యకర్తలు దానిని లెక్క చేయకుండా ఉత్సాహంగా ర్యాలీలో పాల్గొన్నారు. ఆయనను చూసేందుకు అభిమానులు వర్షంలోనే ఎదురు చూశారు. తన నివాసానికి ర్యాలీగా వెళ్లిన చంద్రబాబు టీడీపీ జెండాను చేతబట్టి కార్యకర్తలను ఉత్సాహపరిచారు. డప్పులు, కళాకారుల విన్యాసాలతో ర్యాలీ కొనసాగింది. నగరంలో పలుచోట్ల స్వాగత ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు.







