ధోనీ కొత్త హెయిర్ స్టయిల్ చూశారా?.. బాలీవుడ్ హీరోలకు ఏమాత్రం తీసిపోని లుక్‌లో తలా!
- ధోనీ న్యూ హెయిర్ స్టైల్ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్
- మహీ కొత్త హెయిర్ స్టైల్ ఫొటోలను పంచుకున్న ప్రముఖ హెయిర్ స్టైలిస్ట్ ఆలిమ్ హకీం
- ఎంఎస్‌డీని కొత్త లుక్‌లో చూసి ఖుషీ అవుతున్న అభిమానులు
ఇదిలాఉంచితే.. మహేంద్రుడు క్రికెట్‌తో పాటు ఫ్యాషన్‌ను కూడా బాగా ఫాలో అవుతుంటాడనే విషయం తెలిసిందే. అందుకే అతడు తరచూ ట్రెండీ లుక్స్‌లో దర్శనమిస్తుంటాడు. దీనిలో భాగంగా తరచుగా తన హెయిర్ స్టైల్ ను మారుస్తూ ఉంటాడు. ఇటీవల ముగిసిన ఐపీఎల్ 17వ సీజన్‌లో లాంగ్ హెయిర్‌తో మహీ వింటెజ్ లుక్‌లో కనిపించిన విషయం తెలిసిందే.

ఇప్పుడు మరోసారి ఎంఎస్‌డీ తన హెయిర్ స్టైల్ ను మార్చేశాడు. తలా న్యూ హెయిర్ స్టైల్ తాలూకు ఫొటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. కొత్త హెయిర్ స్టైల్‌లో ధోనీ బాలీవుడ్ హీరోలకు ఏమాత్రం తీసిపోని విధంగా కనిపిస్తున్నాడు. దీంతో ఆయన అభిమానులు ఫుల్ ఖుషీ అవుతున్నారు.
కాగా, మహీ కొత్త హెయిర్ స్టైల్ ఫొటోలను ప్రముఖ హెయిర్ స్టైలిస్ట్ ఆలిమ్ హకీం ఇన్‌స్టాగ్రామ్ వేదికగా పంచుకున్నాడు. మన యంగ్, డైనమిక్ అండ్ హ్యాండ్సమ్ మహేంద్ర సింగ్ ధోనీ అంటూ రాసుకొచ్చాడు. ఇక ఈ ఫొటోలలో మహేంద్రుడు నలుపు రంగు టీ షర్ట్, పొట్టిగా ఉన్న హెయిర్‌కట్‌తో కనిపించాడు. మొత్తంగా తలా తన న్యూలుక్‌తో ఆకట్టుకుంటున్నాడు.