Devineni Uma: చేసిన పాపాలు ఊరికే పోవు: దేవినేని ఉమా

Devineni Uma slams Macherla ex MLA Pinnelli
షార్ట్స్‌లో చూడండి
మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెలి రామకృష్ణారెడ్డి అరెస్ట్ నేపథ్యంలో, టీడీపీ సీనియర్ నేత దేవినేని ఉమా స్పందించారు. మాచర్లలో వైసీపీ అరాచకాలకు తెరపడిందని పేర్కొన్నారు. 

ఈవీఎంలను పగులగొట్టి ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేశారని, చంబల్ లోయ మాదిరిగా సొంత సామ్రాజ్యంలా మార్చుకుని లెక్కకు మించిన తప్పులు చేశారని ఉమా విమర్శించారు. దాడులు, హత్యలతో అరాచకాలకు అడ్డాగా మార్చారని ధ్వజమెత్తారు. 

చేసిన పాపాలు ఊరికే పోవని, ఎన్నికల హింస కేసులో కటకటాల వెనక్కి వెళ్లారని పేర్కొన్నారు. తప్పులు చేసిన వారికి ఎప్పటికైనా శిక్ష తప్పదు అంటూ దేవినేని ఉమా తన ట్వీట్ ను జగన్ కు ట్యాగ్ చేశారు. 

గతంలో పల్నాడులో టీడీపీ నేతల కారుపై దాడి జరిగిన దృశ్యాలను, పిన్నెల్లి ఈవీఎంను పగులగొట్టిన క్లిప్పింగ్ ను కూడా ఉమా వీడియో రూపంలో పంచుకున్నారు .
Go Back to Shorts
Devineni Uma
Pinnelli Ramakrishna Reddy
Macherla
TDP
YSRCP

More Telugu News