ఏపీలో రెండు ఎమ్మెల్సీ స్థానాల ఉపఎన్నికల షెడ్యూల్ విడుదల
- ఎన్నికల ముందు వైసీపీని వీడిన ఎమ్మెల్సీలు సి.రామచంద్రయ్య, ఇక్బాల్
- టీడీపీలో చేరిన ఇద్దరు ఎమ్మెల్సీలపై మండలి చైర్మన్ అనర్హత వేటు
- ఆ రెండు స్థానాలకు జులై 12న ఉప ఎన్నికలు
ఈ ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ స్థానాల ఉప ఎన్నికకు జూన్ 25న నోటిఫికేషన్ విడుదల చేయనున్నారు. నామినేషన్ల దాఖలుకు జులై 2వ తేదీ తుది గడువు. నామినేషన్లు ఉపసంహరించుకునేందుకు జులై 5 వరకు అవకాశం ఉంటుంది. జులై 12న పోలింగ్ నిర్వహించి, అదే రోజున ఫలితాలు వెల్లడిస్తారు.