మూడు కొత్త టిమ్స్ ఆసుపత్రులపై కేటీఆర్ ట్వీట్

మూడు కొత్త టిమ్స్ ఆసుపత్రులపై కేటీఆర్ ట్వీట్

KTR tweets on TIMS hospitals
  • సనత్ నగర్, అల్వాల్, ఎల్బీనగర్‌లలో అద్భుతంగా నిర్మిస్తున్నట్లు వెల్లడి
  • రూ.2,679 కోట్లతో ఆసుపత్రులు నిర్మిస్తున్నట్లు పేర్కొన్న కేటీఆర్
  • ఇందుకు సంబంధించిన ఫొటోలను షేర్ చేసిన కేటీఆర్
హైదరాబాద్‌లోని టిమ్స్ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సోమవారం ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు. సనత్ నగర్, అల్వాల్, ఎల్బీనగర్‌లలోని ప్రతిపాదిత మూడు కొత్త టిమ్స్ ఆసుపత్రులు అద్భుతంగా రూపుదిద్దుకుంటున్నాయని... ఇందుకు చాలా సంతోషంగా ఉందని పేర్కొన్నారు.

తెలంగాణ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడిక‌ల్ సైన్సెస్ ఆసుపత్రులు హైద‌రాబాద్ ఆరోగ్య సంర‌క్ష‌ణ వ్య‌వ‌స్థ‌ను పున‌ర్ నిర్మిస్తాయన్నారు. ప‌ట్ట‌ణ పేద‌ల‌కు వికేంద్రీకృత వైద్యాన్ని ఈ ఆసుపత్రులు అందిస్తాయ‌న్నారు. ఈ మూడు సూప‌ర్ స్పెషాలిటీ ఆసుపత్రులు రూ.2,679 కోట్ల వ్య‌యంతో నిర్మాణం జరుపుకుంటున్నట్టు పేర్కొన్నారు. ఇందుకు సంబంధించిన ఫొటోలను ఆయన షేర్ చేశారు. ఈ ఆసుపత్రులకు నాటి ముఖ్యమంత్రి కేసీఆర్ శంకుస్థాపన చేశారు. 
Advertisement
KTR
TIMS
Hyderabad
BRS

More Telugu News