అనకాపల్లిలో నూకాంబిక అమ్మవారిని దర్శించుకున్న పవన్ కల్యాణ్
- ఈ మధ్యాహ్నం నూకాంబిక ఆలయానికి విచ్చేసిన జనసేనాని
- ఆలయ మర్యాదలతో స్వాగతం పలికిన అధికారులు
- అమ్మవారికి అర్చనలు చేసిన పవన్ కల్యాణ్
పవన్ కల్యాణ్ ఇవాళ అనకాపల్లిలోని నూకాంబిక అమ్మవారి ఆలయాన్ని సందర్శించారు. ఆలయ వర్గాలు జనసేనానికి ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. అనంతరం, పవన్ నూకాంబిక అమ్మవారిని దర్శించుకుని అర్చనలు చేశారు. ఈ సందర్భంగా అర్చకులు ఆయనకు వేదాశీర్వచనాలు అందించారు. ఆలయ అధికారులు పవన్ కు అమ్మవారి చిత్రపటాన్ని బహూకరించారు.

