హైదరాబాద్ సహా పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ
- పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం కురిసే అవకాశం
- ఉపరితల ఆవర్తనం, షియర్ జోన్ ప్రభావంతో తెలంగాణలో వర్షాలు కురుస్తున్నాయన్న వాతావరణ శాఖ
- ఉరుములు, మెరుపులతో కూడిన బలమైన ఈదురు గాలులతో వర్షం పడవచ్చని సూచన
శుక్రవారం జీహెచ్ఎంసీ పరిధితో పాటు, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, రంగారెడ్డి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, మహబూబ్ నగర్, నాగర్ కర్నూలు, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల జిల్లాలో భారీ వర్ష సూచన ఉందని తెలిపింది. ఉరుములు, మెరుపులతో కూడిన బలమైన ఈదురు గాలులతో వర్షం పడవచ్చునని వాతావరణ శాఖ తెలిపింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ హెచ్చరించింది.