చంద్రబాబు ప్రమాణస్వీకారం ఎప్పుడంటే..
- నాలుగోసారి సీఎం కానున్న టీడీపీ అధినేత
- జూన్ 9న ప్రమాణస్వీకారానికి ఛాన్స్
- కార్యక్రమానికి హాజరు కానున్న ప్రధాని మోదీ
ఇక ఏపీలో మొత్తం 175 అసెంబ్లీ సీట్లకు గాను కూటమి 164 సీట్లు కైవసం చేసుకుంది. టీడీపీకి 135, జనసేనకు 21, బీజేపీకి 8 సీట్లు దక్కాయి. ఏపీ లోక్ సభ స్థానాల్లో టీడీపీకి 16, జనసేకు 2, బీజేపీకి 3 సీట్లు దక్కాయి. వైసీపీ నాలుగు సీట్లకే పరిమితమైంది. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ మంగళగిరి నియోజకవర్గంలో ఘన విజయం సాధించారు. ఈ ఎన్నికల్లో జనసేన, బీజేపీ గేమ్ ఛేంజర్లుగా అవతరించాయి.