సీఎంగా చంద్రబాబు ప్రమాణస్వీకారం.. ఎక్కడ, ఎప్పుడంటే..!
- ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ కూటమి క్లీన్‌స్వీప్
- ప్రస్తుతం 160కి పైగా స్థానాల్లో కూటమి అభ్యర్థుల లీడ్
- టీడీపీ కూటమి విజయం ఖాయమైన నేపథ్యంలో చంద్రబాబు ప్రమాణస్వీకారానికి ముహూర్తం ఖరారు
- జూన్ 9న అమరావతిలో సీఎంగా చంద్రబాబు ప్రమాణస్వీకారం
కాగా, వైసీపీ గెలుస్తుందని తొమ్మిదో తేదిన విశాఖలో జగన్ ప్రమణస్వీకారం చేస్తారని ఆ పార్టీ నేతలు చెబుతూ వచ్చారు. అయితే టీడీపీ గెలుస్తుందని.. చంద్రబాబు అమరావతిలోనే ప్రమాణం చేస్తారని ఆ పార్టీ నేతలు కౌంటర్ ఇస్తూ వచ్చారు. ఇప్పుడు అనూహ్యమైన ఫలితాలు రావడంతో అమరావతిలో ప్రమాణ స్వీకారానికి ఏర్పాట్లు చేయనున్నారు.