రేపు హైదరాబాద్‌లో వైన్ షాపుల బంద్.. 144 సెక్షన్!
- మంగళవారం లోక్‌సభ ఎన్నికల కౌంటింగ్
- భాగ్యనగరంలో మూతపడనున్న మద్యం దుకాణాలు
- హైదరాబాదులో రేపు ఉదయం 6 గంటల నుంచి 144 సెక్షన్ అమలు
కాగా, తెలంగాణలో గత నెల 13వ తారీఖున లోక్‌సభ ఎన్నికలతో పాటు కంటోన్మెంట్ అసెంబ్లీ స్థానానికి ఉప ఎన్నిక జరిగిన విషయం తెలిసిందే. మంగళవారం ఓట్ల లెక్కింపునకు అధికారులు ఇప్పటికే అన్ని ఏర్పాట్లు చేశారు. దీనిలో భాగంగా మల్కాజ్‌గిరి, చేవెళ్ల, హైదరాబాద్, సికింద్రాబాద్ నియోజకవర్గాల పరిధిలో మొత్తం 19 కౌంటింగ్ కేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగింది.
కౌంటింగ్ కేంద్రాల వద్ద భారీ బందోబస్తు కూడా ఏర్పాటు చేశారు. ఇక కౌంటింగ్ కేంద్రాల్లోకి ఈసీ జారీ చేసిన పాసులు ఉన్న సిబ్బంది, వివిధ పార్టీల అభ్యర్థుల ఏజెంట్లు, మీడియా ప్రతినిధులను మాత్రమే అనుమతించనున్నారు.