మోదీ ఓడిపోవాలి.. పాక్ మాజీ మంత్రి ఫవాద్ చౌదరి వ్యాఖ్య
- రాహుల్ గాంధీ, కేజ్రీవాల్, మమతా బెనర్జీలకు శుభాకాంక్షలు
- పాకిస్థాన్ నుంచి విపక్ష నేతలకు మద్దతుపై మంగళవారం ప్రధాని విమర్శలు
- ప్రధాని ఆందోళన వెలిబుచ్చిన మరుసటి రోజే పాక్ మాజీ మంత్రి స్పందన
కాంగ్రెస్ మాజీ చీఫ్, వయనాడ్ ఎంపీ రాహుల్ గాంధీకి, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ కు అనుకూలంగా ఫవాద్ చౌదరి గతంలోనూ పలుమార్లు కామెంట్స్ చేశారు. దీనిపై మంగళవారం ఓ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ప్రధాని నరేంద్ర మోదీ ఆందోళన వ్యక్తం చేశారు. దాయాది దేశం నుంచి మన దేశంలోని రాజకీయ నేతలకు మద్దతు లభించడం ఆందోళనకరమని, దీనిపై విచారణ జరగాల్సిన అవసరం ఉందని మోదీ వ్యాఖ్యానించారు. అయితే, మోదీ ఈ వ్యాఖ్యలు చేసిన మరుసటిరోజే ఫవాద్ మరోసారి రాహుల్, కేజ్రీవాల్, మమతా బెనర్జీలకు శుభాకాంక్షలు చెప్పడం గమనార్హం.