కష్టాల్లో మాల్దీవులు.. ఆదుకోవాలంటూ అంతర్జాతీయ సమాజానికి విజ్ఞప్తి
- మాల్దీవులు, ఆటిగ్వా, బార్బుడా సంయుక్త అధ్యక్షతన సోమవారం సదస్సు
- వాతావరణ మార్పులతో సముద్రమట్టాలు పెరిగిపోతున్నాయన్న మాల్దీవుల అధ్యక్షుడు
- ధనిక దేశాల సాయం లేకుండా గట్టెక్కడం కష్టమని వ్యాఖ్య
- అంతర్జాతీయ సమాజం నుంచి తగినన్ని నిధులు రావట్లేదని ఆందోళన
పర్యాటకమే ప్రధాన వనరుగా మనుగడ కొనసాగిస్తున్న ద్వీప దేశాలు ప్రతి ఐదేళ్లకొకసారి సమావేశమై అభివృద్ది చర్యలపై చర్చిస్తాయి. తాజాగా మాల్దీవులు, ఆటిగ్వా, బార్బుడా సంయుక్త అధ్యక్షతన సోమవారం సదస్సు ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో ముయిజ్జు వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. నామమాత్రపు అభివృద్ధి సాధించిన దేశాల ఆదాయంతో పోలిస్తే కేవలం 14 శాతం ఆదాయం మాత్రమే ఎస్ఐడీఎస్ దేశాలకు వస్తోందని ముయిజ్జు ఈ సందర్భంగా అన్నారు. సముద్ర మట్టాల పెరుగుదలతో కలిగే నష్టాన్నీ భర్తీ చేసుకునేందుకు తమకు 500 మిలియన్ డాలర్ల నిధులు కావాలని ముయిజ్జు పేర్కొన్నాడు. ధనిక దేశాల సాయం లేకుండా ఈ మొత్తాన్ని సమకూర్చుకోవడం తమకు తలకు మించిన భారమని పేర్కొన్నారు.
ఇక పర్యావరణ మార్పుల నుంచి బయటపడేందుకు మాల్దీవులు అనేక చర్యలు చేపడుతోంది. దాదాపు 30 వేల అపార్ట్ మెంట్లతో రాస్ మాలే పేరిట ఓ కృత్రిమ ద్వీపాన్ని నిర్మించింది. ఇందులో అనేక నిర్మాణాలను చైనా సంస్థలకే కట్టబెట్టింది.