Fear Song: "దూకే ధైర్యమా... దేవర ముంగిట నువ్వెంత...!" ఎన్టీఆర్ 'దేవర' నుంచి 'ఫియర్ సాంగ్' ఇదిగో!

Fear Song from NTR starring Devara out now
షార్ట్స్‌లో చూడండి
యంగ్ టైగర్ ఎన్టీఆర్, దర్శకుడు కొరటాల శివ కాంబినేషన్ లో రూపుదిద్దుకుంటున్న చిత్రం దేవర. తాజాగా ఈ చిత్రం నుంచి ఫియర్ సాంగ్ రిలీజైంది. "దూకే  ధైర్యమా... జాగ్రత్త... రాకే, తెగబడి రాకే... దేవర ముంగిట నువ్వెంత" అంటూ సాగే ఈ పవర్ ఫుల్ గీతానికి అనిరుధ్ రవిచందర్ బాణీలు సమకూర్చగా, రామజోగయ్యశాస్త్రి సాహిత్యం అందించారు. సంగీత దర్శకుడు అనిరుధ్ రవిచందర్ స్వయంగా ఆలపించారు. 

ఎన్టీఆర్ ఆర్ట్స్, యువసుధ ఆర్ట్స్ బ్యానర్లపై తెరకెక్కుతున్న దేవర చిత్రంలో ఎన్టీఆర్ సరసన బాలీవుడ్ భామ జాన్వీ కపూర్ కథానాయిక. బాలీవుడ్ నటుడు సైఫ్ అలీ ఖాన్ విలన్ గా నటిస్తున్నాడు. ప్రకాశ్ రాజ్, శ్రీకాంత్, షీనే టామ్ చాకో కీలక పాత్రలు పోషిస్తున్నారు.
Go Back to Shorts
Fear Song
Devara
NTR
Koratala Siva
NTR Arts
Yuvasudha ARts

More Telugu News