తిరుమల వెళ్లి వెంకటేశ్వరస్వామిని దర్శించుకున్న చంద్రబాబు
Advertisement

తిరుమల వెళ్లి వెంకటేశ్వరస్వామిని దర్శించుకున్న చంద్రబాబు

Chandrababu visits Tirumala this evening
  • నేటితో ముగిసిన ఎన్నికల ప్రచారం
  • చిత్తూరులో చివరి ప్రజాగళం సభ నిర్వహించిన చంద్రబాబు
  • సభ అనంతరం తిరుమల పయనం
ఏపీలో ఇవాళ ఎన్నికల ప్రచారానికి ఆఖరి రోజు కాగా, ఈ ఎన్నికల్లో చివరి ప్రజాగళం సభను చంద్రబాబు చిత్తూరులో నిర్వహించారు. ఈ సభ ముగిసిన వెంటనే ఆయన తిరుమల వెళ్లారు. సంప్రదాయ దుస్తులు ధరించి స్వామివారిని దర్శించుకున్నారు. చంద్రబాబుకు ఆలయ వర్గాలు తీర్థ ప్రసాదాలు అందజేశాయి. 

చంద్రబాబు రాకతో ఆలయం వద్ద సందడి నెలకొంది. క్యూలైన్లలో ఉన్న భక్తులకు చంద్రబాబు అభివాదం చేశారు. కాగా, చంద్రబాబు తిరుమల పర్యటన నేపథ్యంలో పోలీసుల కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు. తిరుమల శ్రీవారి దర్శనం అనంతరం చంద్రబాబు రేణిగుంట ఎయిర్ పోర్టుకు బయల్దేరారు.
Advertisement
Chandrababu
Tirumala
Chittoor
Praja Galam

More Telugu News