కొండా విశ్వేశ్వర్ రెడ్డి నాకు మంచి మిత్రుడు, బంధువు... ఆయనను గెలిపించండి: చిరంజీవి
- చేవెళ్ల బీజేపీ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న విశ్వేశ్వర్ రెడ్డి
- ఉన్నత విద్యావంతుడు, సమాజ సేవ కోసం రాజకీయాల్లోకి వచ్చారన్న చిరంజీవి
- ఆయనను చేవెళ్ల ఓటర్లు గెలిపించాలన్న మెగాస్టార్
సుదీర్ఘ రాజకీయ నేపథ్యం ఉన్న కుటుంబం నుంచి విశ్వేశ్వర్ రెడ్డి వచ్చారని... ఉన్నత విద్యావంతుడని తెలిపారు. ఇలాంటి వ్యక్తి సమాజ సేవ కోసం రాజకీయాల్లోకి వచ్చారని చెప్పారు. నియోజకవర్గానికి గతంలో ఆయన చేసిన సేవ అందరికీ తెలిసిందేనని... చేవెళ్ల ఓటర్లు తమ విలువైన ఓట్లను విశ్వేశ్వర్ రెడ్డికి వేసి, ఆయనను గెలిపించాలని కోరుతున్నానని అన్నారు. మంచి వ్యక్తులను గెలిపించుకుంటేనే సమాజం బాగు పడుతుందని చెప్పారు.