'సలార్' శ్రియారెడ్డి పొలిటికల్ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్ .. ఓటీటీలో!
- వెబ్ సిరీస్ ల వైపు శ్రియా రెడ్డి
- రీసెంటుగా పూర్తిచేసిన 'తలమై సేయలగం'
- 8 ఎపిసోడ్స్ గా రూపొందిన సిరీస్
- ఈ నెల 17 నుంచి జీ 5లో స్ట్రీమింగ్
రాడాన్ మీడియా బ్యానర్ పై రాధిక నిర్మించిన ఈ సిరీస్ కి వసంత్ బాలన్ దర్శకత్వం వహించాడు. 8 ఎపిసోడ్స్ గా ఈ సిరీస్ ను తమిళంతో పాటు తెలుగులోను అందించనున్నారు. ఇతర ప్రధానమైన పాత్రలలో ఆదిత్య మీనన్ .. భరత్ .. కన్నడ కిశోర్ .. రమ్య నంబీసన్ కనిపించనున్నారు. ఈ నెల 17వ తేదీ నుంచి ఈ సిరీస్ ను జీ 5 లో స్ట్రీమింగ్ చేయనున్నారు.
తమిళనాడులోని స్వార్థ రాజకీయాలు .. అధికార దాహం ఒక వైపు, మరో వైపున వరుసగా జరుగుతున్న హత్యలు .. ఈ నేపథ్యం చుట్టూనే ఈ కథ నడుస్తుంది. పగలు .. ప్రతీకారాలు .. కుట్రలు .. కుతంత్రాలు ప్రధానమైన అంశాలుగా కనిపిస్తాయి. మరి ఈ వెబ్ సిరీస్ ఏ స్థాయిలో ఆడియన్స్ కి కనెక్ట్ అవుతుందనేది చూడాలి.