ఏపీకి వర్ష సూచన

ఏపీకి వర్ష సూచన

Rain alert for AP
  • కొనసాగుతున్న ఉపరితల ద్రోణి
  • మే 10న కూడా రాష్ట్రంలోని వివిధ జిల్లాల్లో వర్షాలు
  • పిడుగులు పడే అవకాశం ఉందన్న రాష్ట్ర విపత్తుల నిర్వహణ శాఖ 
ఉపరితల ద్రోణి ప్రభావంతో ఏపీలో రేపు (మే 10) కూడా వర్షాలు పడతాయని రాష్ట్ర విపత్తుల నిర్వహణ శాఖ తెలిపింది. విశాఖ, శ్రీకాకుళం, కాకినాడ, విజయనగరం, తూర్పుగోదావరి, పార్వతీపురం మన్యం, ఏలూరు, అనకాపల్లి జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన వర్షాలు కురుస్తాయని విపత్తుల నిర్వహణ శాఖ ఎండీ రోణంకి కూర్మనాథ్ వెల్లడించారు. తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు పడే అవకాశముందని వివరించారు. 

అదే సమయంలో, అన్నమయ్య జిల్లా, కర్నూలు, నంద్యాల, చిత్తూరు, అనంతపురం, సత్యసాయి, కడప జిల్లాల్లో పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు పడతాయని పేర్కొన్నారు.
Advertisement
Rain
Andhra Pradesh
APSDMA
Weather

More Telugu News