Vithika: పిల్లల్ని కనకపోవడంపై సినీ నటి వితికా షాకింగ్ కామెంట్స్!

Vithika reveals the reason for not having children
షార్ట్స్‌లో చూడండి
టాలీవుడ్ లో ఉన్న అందమైన జంటల్లో వరుణ్ సందేశ్, వితికా షేరుల జంట ఒకటి. 2016లో ప్రేమ వివాహం చేసుకున్న వీరు... ఎంతో అన్యోన్యమైన జీవితాన్ని గడుపుతున్నారు. పెళ్లై ఇన్నేళ్లవుతున్నా వీరికి పిల్లలు కలగలేదు. దీనిపై తాజాగా వితిక క్లారిటీ ఇచ్చారు. 

'పడ్డానండీ ప్రేమలో' సినిమా సందర్భంగా ఇద్దరికీ పరిచయం ఏర్పడి, ప్రేమగా మారిందని వితిక తెలిపారు. ఆ తర్వాత 2016లో పెళ్లి చేసుకున్నామని చెప్పారు. అమెరికాలో సెటిల్ అయిపోదామని అక్కడకు వెళ్లామని... కొంత కాలం అక్కడే ఉన్నామని తెలిపారు. 2018లో తాను ప్రెగ్నెంట్ అయ్యానని... అప్పుడు ఎంతో సంతోషించామని, ఈ విషయాన్ని ఫ్యామిలీతో కూడా పంచుకున్నామని చెప్పారు. కానీ కొన్ని రోజులకే అబార్షన్ అయిందని... కొన్ని రోజుల పాటు తాము ఆ బాధలోనే ఉండిపోయామని తెలిపారు. 

బాధలోనే 'బిగ్ బాస్' షోలో పాల్గొన్నామని వితిక తెలిపింది. తనకు చిన్న పిల్లలంటే ఎంతో ఇష్టమని చెప్పారు. తాను ఎక్కడకు వెళ్లినా పిల్లలను ఎప్పుడు కంటారు? అనే ప్రశ్న ఎదురవుతోందని తెలిపారు. పిల్లల్ని కనకూడదని ఎవరైనా అనుకుంటారా? అని ప్రశ్నించారు. ఆ క్షణం వస్తే అందరితో పంచుకుంటామని తెలిపారు.
Go Back to Shorts
Vithika
Varun Sandesh
Children
Tollywood

More Telugu News