ఏపీలో బీజేపీ అభ్యర్థి తరఫున ప్రచారానికి వచ్చిన నమిత

Namitha campaigns for BJP candidate in Dharmavaram
  • ధర్మవరం అసెంబ్లీ స్థానం నుంచి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న సత్యకుమార్
  • నేడు ధర్మవరంలో రోడ్ షో
  • భర్తతో కలిసి హాజరైన నమిత
  • నమితను చూసేందుకు భారీగా తరలి వచ్చిన జనాలు
అందాల భామ నమిత ఏపీలో ఎన్నికల ప్రచారానికి వచ్చారు. శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి కూటమి అభ్యర్థిగా పోటీ చేస్తున్న బీజేపీ నేత సత్యకుమార్ తరఫున నమిత నేడు ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. నమిత తమిళనాడు బీజేపీ నేత అని తెలిసిందే. 

ఆమె తన భర్తతో కలిసి ధర్మవరం వచ్చారు. ఇక్కడి చౌడేశ్వరి అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ధర్మవరం టౌన్ లో నిర్వహించిన రోడ్ షోలో నమితను చూసేందుకు జనాలు భారీగా తరలివచ్చారు. 

ఏపీలో పొత్తు కారణంగా ధర్మవరం అసెంబ్లీ స్థానం బీజేపీకి కేటాయించారు. ఇక్కడ్నించి సత్యకుమార్ పోటీ చేస్తుండగా, వైసీపీ నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి బరిలో ఉన్నారు.
Go Back to Shorts
Namitha
Dharmavaram
Sathya Kumar
BJP
Road Show
Andhra Pradesh
Tamil Nadu

More Telugu News