తన రిటైర్మెంట్ వెనుక ఉన్న కారణాన్ని చెప్పి.. వెక్కి వెక్కి ఏడ్చిన పాక్ మాజీ క్రికెటర్!
- టీవీ ఛానెల్ ఇంటర్వ్యూలో కన్నీటి పర్యంతమైన మాజీ క్రికెటర్ ఉమర్ గుల్
- మిత్రుడు కలీమ్‌ను యాక్సిడెంట్‌లో కోల్పోవడంతో ఆ బాధలోనే క్రికెట్ నుంచి వైదొలిగినట్లు వెల్లడి
- ఈ విషయం ఇప్పటివరకు తన భార్యకు కూడా చెప్పలేదన్న గుల్
ఉమర్ గుల్ మాట్లాడుతూ.. "కరోనా మొదటి దశ సమయంలో నా ప్రాణ స్నేహితుడు కలీమ్ రోడ్డు ప్రమాదంలో చనిపోయాడు. రంజాన్ పండుగకు రెండు రోజుల ముందు ఈ ఘటన జరిగింది. అతడి మృతిని జీర్ణించుకోలేకపోయా. అందుకే క్రికెట్‌కు వీడ్కోలు పలికా. ఈ విషయం నా భార్యకు కూడా తెలియదు" అని గుల్ గద్గద స్వరంతో చెప్పాడు. ఉమర్ గుల్ ఈ ఇంటర్వ్యూ తాలూకు వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. వీడియో చూసిన నెటిజన్లు గుల్‌కు సంఘీభావం తెలియజేస్తున్నారు.