అది చంద్రబాబు విచక్షణకే వదిలేస్తున్నా: వైఎస్ భారతి
- పులివెందులలో ప్రచారం నిర్వహిస్తున్న భారతి
- జగన్ గురించి చంద్రబాబు మాట్లాడుతున్న తీరు సరిగా లేదని వ్యాఖ్య
- ఒక వ్యక్తిని అడ్డు తొలగించాలనుకోవడం సరికాదని వ్యాఖ్య
జగన్ పై జరిగిన రాయి దాడి గురించి మాట్లాడుతూ... ఒక వ్యక్తిని చంపాలనుకోవడం సరికాదని అన్నారు. ప్రజలను మెప్పించాలని అనుకోవాలే కానీ... అడ్డు తొలగించుకోవాలనుకోవడం దారుణమని చెప్పారు. దీన్ని ఆయన విచక్షణకే వదిలేస్తున్నామని అన్నారు. పులివెందులలో అభివృద్ధి లేదనే వారికి కళ్లు లేవనుకోవాలని చెప్పారు. పులివెందులలో ఎంతో అభివృద్ధి జరిగిందని తెలిపారు. మరింత అభివృద్ధి జరగాలంటే జగన్ కు మరోసారి ఓటు వేసి గెలిపించాలని అన్నారు.