వైరల్ అవుతున్న సమంత రీమోడల్డ్ గౌన్

Samantha remodelled her wedding gown
  • ఎల్లి సస్టైనబిలిటీ అవార్డ్ ఫంక్షన్ లో మెరిసిన సమంత
  • బ్లాక్ కలర్ గౌన్ తో ఆకట్టుకున్న సామ్
  • తన పెళ్లి గౌన్ ను రీమోడల్ చేయించిన సమంత
సినీ నటి సమంత తరచుగా వార్తల్లో నిలుస్తూనే ఉంటారు. తాజాగా ఆమె మరోసారి హెడ్ లైన్స్ లో నిలిచారు. తాజాగా 'ఎల్లీ సస్టైనబిలిటీ అవార్డ్స్'లో ఆమె పాల్గొన్నారు. ముంబై వేదికగా ఈ వేడుక జరిగింది. ఈ వేడుకలో ఆమె నలుపు రంగు గౌన్ ధరించి అందరినీ ఆకట్టుకున్నారు. ఫొటోలను ఆమె ఇన్స్టాలో షేర్ చేశారు. 

2017లో సమంత - నాగచైతన్య పెళ్లి చేసుకున్నారు. అక్టోబర్ 6, 7 తేదీల్లో గోవా వేదికగా క్రిస్టియన్, హిందూ సంప్రదాయాల్లో పెళ్లి చేసుకుంది. క్రిస్టియన్ వెడ్డింగ్ లో తెల్ల రంగులో ఉన్న గౌన్ ను ఆమె ప్రత్యేకంగా డిజైన్ చేయించుకున్నారు. ఆ గౌన్ నే తాజాగా ఆమె నలుపు రంగులోకి మార్పించి, ఇప్పుడు ధరించారు. దీనికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు వైరల్ అయ్యాయి. 

మరోవైపు సమంత ఇన్స్టాలో స్పందిస్తూ... తనకెంతో ఇష్టమైన గౌన్ ను రీమోడలింగ్ చేయించి, ఈ కార్యక్రమం కోసం ఉపయోగించానని చెప్పారు. దీన్ని ఇంత అందంగా డిజైన్ చేసిన క్రేశా బజాజ్ కు ధన్యవాదాలు తెలుపుతున్నానన్నారు. జీవనశైలిని మరింత స్థిరంగా చేసుకోవడంలో పాత దుస్తులను రీమోడలింగ్ చేయించడం కూడా ఒకటని చెప్పారు. తనపై చూసిస్తున్న అభిమానానికి అందరికీ ధన్యవాదాలు చెపుతున్నానని అన్నారు. 

Advertisement
Samantha
Tollywood
Gown

More Telugu News