ఎన్టీఆర్ స్కూల్ విద్యార్థిని భావజ్ఞకు 10వ తరగతిలో స్టేట్ 3వ ర్యాంకు... నారా భువనేశ్వరి అభినందనలు
- 10వ తరగతి పరీక్షల్లో ఎన్టీఆర్ మోడల్ స్కూల్ విద్యార్థిని మెరుగైన ప్రదర్శన
- కృషి, పట్టుదల ఉంటే విజయం సొంతం అవుతుందన్న నారా భువనేశ్వరి
- అందుకు ఈ అమ్మాయే నిదర్శనం అని కితాబు
"కె.భావజ్ఞ సాయికి అభినందనలు. కృషి, పట్టుదలతో ప్రయత్నిస్తే విజయం సొంతం అవుతుందనడానికి ఈ విద్యార్ధినే నిదర్శనం. భవిష్యత్తులో మరింత ఉన్నత శిఖరాలను అధిరోహించాలని కోరుకుంటున్నాను" అంటూ నారా భువనేశ్వరి ట్వీట్ చేశారు.