అమేథిలో రాబర్ట్ వాద్రాకు అనుకూలంగా వెలిసిన పోస్టర్లు
- ఇప్పటికే రాయ్‌బరేలిలో ప్రియాంకగాంధీకి అనుకూలంగా పోస్టర్లు
- రాబర్ట్ వాద్రా కావాలని అమేథి ప్రజలు కోరుకుంటున్నారంటూ పోస్టర్లు
- వయనాడ్ నుంచి పోటీ చేస్తున్న రాహుల్ గాంధీ
అమేథి 2019 వరకు కాంగ్రెస్ పార్టీకి కంచుకోట. ఇక్కడి నుంచి రాహుల్ గాంధీ 2004 నుంచి వరుసగా మూడుసార్లు గెలిచారు. 2019లో స్మతి ఇరానీ చేతిలో పరాజయం పాలయ్యారు. కాంగ్రెస్ పార్టీ ఇప్పటి వరకు అమేథి, రాయ్‌బరేలీ నియోజకవర్గాలకు అభ్యర్థులను ప్రకటించలేదు. రాహుల్ గాంధీ ఇప్పటికే వయనాడ్ నుంచి పోటీ చేస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో రాయ్‌బరేలిలో ప్రియాంకకు అనుకూలంగా, అమేథిలో రాబర్ట్ వాద్రాకు అనుకూలంగా పోస్టర్లు వెలిశాయి.