నా భర్త ఇంకో అమ్మాయిని ప్రేమించాడు: స్నేహ
- తమిళ నటుడు ప్రసన్నను ప్రేమ వివాహం చేసుకున్న స్నేహ
- మరో అమ్మాయితో తన భర్తకు బ్రేకప్ అయిందని వెల్లడి
- బ్రేకప్ కాకపోతే ప్రసన్న తనకు భర్తగా దొరికేవాడు కాదన్న స్నేహ
తమిళ సినీ నటుడు ప్రసన్నను 2021లో ఆమె ప్రేమ వివాహం చేసుకున్నారు. వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. మరోవైపు తన భర్త ప్రసన్న గురించి ఆమె ఓ ఆసక్తికర విషయాన్ని వెల్లడించారు. గతంలో తన భర్త మరో అమ్మాయిని ప్రేమించాడని, కానీ వారికి బ్రేకప్ అయిందని చెప్పారు. ఆ ప్రేమ వల్ల తనకు ఎలాంటి సమస్య లేదని... వారు బ్రేకప్ కాకపోతే ప్రసన్న తనకు భర్తగా దొరికే వాడు కాదని అన్నారు.
భార్యాభర్తలకు ఒకరికపై మరొకరికి నమ్మకం ఉండాలని... లేకపోతే కలిసి బతకడం కష్టమవుతుందని చెప్పారు. బయటకు ఎందుకు వెళ్తున్నావు, ఈ సమయంలో బయటకు ఎందుకు? వంటి ప్రశ్నలు తలెత్తకూడదని అన్నారు. మనల్ని అవతలి వ్యక్తి సరిగా అర్థం చేసుకుంటే ఇలాంటి ప్రశ్నలు రావని చెప్పారు. పొసెసివ్ నెస్ ఉండాలే కానీ... అది అతిగా ఉండకూడదని అన్నారు.