బాలినేని గ్యాంగ్ పై ఈసీ అధికారులు కేసు నమోదు చేయాలి: నారా లోకేశ్

బాలినేని గ్యాంగ్ పై ఈసీ అధికారులు కేసు నమోదు చేయాలి: నారా లోకేశ్

Nara Lokesh demands to file case against Balineni gang
  • వైసీపీని పరాజయం వెంటాడుతోందన్న లోకేశ్
  • వాలంటీర్ల ఎన్నికల ప్రచారాన్ని నిలదీసిన వారిపై బాలినేని గ్యాంగ్ దాడి చేసిందని విమర్శ
  • మహిళలు అని కూడా చూడకుండా దాడులకు తెగబడుతున్నారని మండిపాటు
వైసీపీని దారుణ పరాజయం వెంటాడుతోందని టీడీపీ యువనేత నారా లోకేశ్ ఎద్దేవా చేశారు. ఈ భయంతోనే వైసీపీ నేతలు ఓ వైపు ఫేక్ ప్రచారాలు, మరోవైపు దాడులకు తెగబడుతున్నారని విమర్శించారు. వైసీపీ ఒంగోలు ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి, ఆయన అనుచరులైన వాలంటీర్ల ఎన్నికల ప్రచారాన్ని నిలదీసిన టీడీపీ అభిమానులపై దాడికి దిగడం దుర్మార్గమని అన్నారు. సమతానగర్ కాలనీ వాసులపై బాలినేని గ్యాంగ్ దాడిని తీవ్రంగా ఖండిస్తున్నానని చెప్పారు. అక్రమాలను నిలదీస్తామని, నిబంధనలు ఉల్లంఘిస్తే నిలబెడతామని అన్నారు. సమాధానం చెప్పే దమ్ములేని పిరికిపందలే మహిళలు అని కూడా చూడకుండా ఇలా దాడులకు తెగబడతారని విమర్శించారు. ఎన్నికల అధికారులు బాలినేని గ్యాంగ్ పై కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. టీడీపీ శ్రేణులపై దాడికి పాల్పడిన వారిని అరెస్ట్ చేయాలని కోరారు. 

Advertisement
Nara Lokesh
Telugudesam
Balineni Srinivasa Reddy
YSRCP

More Telugu News