జనసేన పార్టీకి చిరంజీవి భారీ విరాళం... రూ.5 కోట్ల చెక్ పవన్ కు అందజేత
Add ap7am to your home Screen

జనసేన పార్టీకి చిరంజీవి భారీ విరాళం... రూ.5 కోట్ల చెక్ పవన్ కు అందజేత

Chiranjeevi donates Rs 5 Cr to Janasena Party
  • నిన్న అనకాపల్లి సభలో పవన్ ప్రసంగం
  • పవన్ అమ్మవారి ఆశీస్సులు కోరుతూ చేసిన వ్యాఖ్యలతో చలించిపోయిన చిరంజీవి
  • మరుసటి రోజే భారీ విరాళం అందజేత
  • ఈ ఘట్టానికి వేదికగా నిలిచిన విశ్వంభర షూటింగ్ స్పాట్
మెగాస్టార్ చిరంజీవి జనసేన పార్టీకి భారీ విరాళం ప్రకటించారు. రూ.5 కోట్ల చెక్ ను ఇవాళ జనసేనాని పవన్ కల్యాణ్ కు అందజేశారు. 

చిరంజీవి ప్రస్తుతం విశ్వంభర చిత్రంలో నటిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్ శివారు ప్రాంతం ముచ్చింతల్ లో జరుగుతుండగా... పవన్ కల్యాణ్, నాగబాబు షూటింగ్ లొకేషన్ కు వెళ్లారు. తన తమ్ముళ్లకు చిరంజీవి ప్రేమపూర్వక స్వాగతం పలికారు. ఈ సందర్భంగానే జనసేన పార్టీకి ఆశీస్సులు అందిస్తూ, రూ.5 కోట్ల విరాళం తాలూకు చెక్ ను పవన్ కు అందజేశారు. ఈ సందర్భంగా భావోద్వేగాలకు గురైన పవన్ తన పెద్దన్నయ్య చిరంజీవికి పాదాభివందనం చేశారు. షూటింగ్ స్పాట్ లోనే కొణిదెల బ్రదర్స్ ముగ్గురూ కాసేపు మాట్లాడుకున్నారు. 

నిన్న అనకాపల్లిలో పవన్ కల్యాణ్ వారాహి విజయభేరి సభకు హాజరయ్యారు. ఈ సభలో పవన్ అమ్మవారి ఆశీస్సులు కోరుతూ చేసిన కొన్ని వ్యాఖ్యలతో చిరంజీవి కదిలిపోయారు. తన తమ్ముడికి ఆర్థికంగా అండగా ఉండాలన్న ఉద్దేశంతో ఆ మరుసటి రోజే భారీ విరాళం అందించారు. 

కాగా, చిరంజీవి తనయుడు రామ్ చరణ్ కూడా జనసేన పార్టీకి ఆర్థికంగా అండగా నిలవాలని నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది.
Advertisement
Chiranjeevi
Donation
Janasena
Pawan Kalyan
Nagababu
Vishwambhara
Hyderabad

More Telugu News