ప్రముఖ కాగ్నిటివ్ సైకాలజిస్ట్, నోబెల్ బహుమతి గ్రహీత కాహ్నేమాన్ కన్నుమూత
- ఇజ్రాయెలీ అమెరికన్ శాస్త్రవేత్త కాహ్నేమాన్ కన్నుమూత
- ఆయన మృతిపై ఇజ్రాయెల్ అధ్యక్షుడి సంతాపం
- 2002లో కాహ్నేమాన్‌కు నోబెల్ బహుమతి ప్రదానం
కాహ్నేమాన్‌కు 2002లో నోబెల్ బహుమతి లభించింది. అనిశ్చిత పరిస్థితుల్లో మనుషులు నిర్ణయాలు తీసుకునే తీరును ఆర్థికశాస్త్రంతో అనుసంధానం చేస్తూ ఆయన చేసిన పరిశోధనకు ఈ ప్రతిష్ఠాత్మక అవార్డు దక్కింది. మనిషి నిర్ణయాలు తార్కికంగా ఉంటాయని ఎకనమిక్ థియరీ భావిస్తే, అనిశ్చిత పరిస్థితుల్లో మాత్రం మనుషులు ఇందుకు భిన్నంగా ప్రవర్తిస్తారని ఆయన తన పరిశోధనలతో రుజువు చేశారు. కాహ్నేమాన్ పలు యూనివర్శిటీల్లో అధ్యాపక, పరిశోధన బాధ్యతలు నిర్వర్తించారు.