ఝార్ఖండ్ గవర్నర్ రాధాకృష్ణన్ కు తెలంగాణ గవర్నర్ గా అదనపు బాధ్యతలు

Jharkhand Governor  to discharge functions of Telangana Governor
  • గవర్నర్ పదవికి రాజీనామా చేసిన తమిళిసై
  • రాధాకృష్ణన్ కు తెలంగాణతో పాటు పుదుచ్చేరి  అదనపు బాధ్యతలు కూడా 
  • తమిళనాడు నుంచి బీజేపీ ఎంపీగా తమిళిసై పోటీ చేసే అవకాశం
ఝార్ఖండ్ గవర్నర్ గా ఉన్న రాధాకృష్ణన్ కు తెలంగాణ గవర్నర్ గా అదనపు బాధ్యతలను అప్పగిస్తూ రాష్ట్రపతి భవన్ ఉత్తర్వులు జారీ చేసింది. తెలంగాణతో పాటు పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్ గా కూడా ఆయనను నియమించింది. గవర్నర్ తమిళిసై రాజీనామా చేయడంతో ఆమె స్థానంలో కొత్త గవర్నర్ ను నియమించారు. తమిళనాడు నుంచి తమిళిసై బీజేపీ తరపున ఎంపీగా పోటీ చేయబోతున్నట్టు తెలుస్తోంది. ఈ క్రమంలోనే ఆమె గవర్నర్ పదవికి రాజీనామా చేశారు. ఆమె రాజీనామాను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోదించారు. 
Go Back to Shorts
TS New Governor
CP Radhakrishnan

More Telugu News