KL Rahul: కేఎల్ రాహుల్ ఐపీఎల్ లో ఆడడంపై క్లారిటీ వచ్చింది!

KL Rahul set to play IPL 2024
షార్ట్స్‌లో చూడండి
గాయం కారణంగా ఇటీవల ఇంగ్లండ్ తో టెస్టు సిరీస్ నుంచి మధ్యలోనే తప్పుకున్న టీమిండియా డాషింగ్ వికెట్ కీపర్ బ్యాట్స్ మన్ కేఎల్ రాహుల్ ఐపీఎల్ లో ఆడడంపై స్పష్టత వచ్చింది. కేఎల్ రాహుల్ పూర్తి ఫిట్ నెస్ సాధించాడని బెంగళూరులోని జాతీయ క్రికెట్ అకాడమీ (ఎన్సీయే) నిర్ధారించింది. 

కేఎల్ రాహుల్ ఐపీఎల్ లో లక్నో సూపర్ జెయింట్స్ జట్టుకు కెప్టెన్ గా వ్యవహరిస్తున్నాడు. అయితే, ఇటీవల కేఎల్ రాహుల్ తరచుగా గాయాల బారినపడుతున్నాడు. దాంతో అతడు ఐపీఎల్-2024లో ఆడడంపై అనిశ్చితి నెలకొంది. ఈ నేపథ్యంలో, కేఎల్ రాహుల్ ఫ్యాన్స్ కు ఎన్సీయే నుంచి శుభవార్త అందింది. అయితే, ఇప్పట్లో కేఎల్ రాహుల్ వికెట్ కీపింగ్ చేయకపోవడమే మంచిదని, కేవలం బ్యాట్స్ మన్ గా కొనసాగాలని ఎన్సీయే సూచించింది. 

ఐపీఎల్ తాజా సీజన్ మార్చి 22న ప్రారంభం కానుండగా, లక్నో సూపర్ జెయింట్స్ తన తొలి మ్యాచ్ ను మార్చి 24న రాజస్థాన్ రాయల్స్ తో ఆడనుంది.
Go Back to Shorts
KL Rahul
IPL-2024
Fitness
NCA
LSG
Team India

More Telugu News