అదంతా పుకారే .. అందులో నిజం లేదు: 'బిగ్ బాస్' అలీ రెజా
Add ap7am to your home Screen

అదంతా పుకారే .. అందులో నిజం లేదు: 'బిగ్ బాస్' అలీ రెజా

Ali Reza Interview
  • బిగ్ బాస్ సీజన్ 3లో సందడి చేసిన అలీ రెజా 
  • తమ సీజన్ సమయంలో హైప్ బాగుండేదని వ్యాఖ్య 
  • తన ఎలిమినేషన్ బాధించిందని వెల్లడి 
  • రీ ఎంట్రీ అలా జరిగిందంటూ వివరణ  

'బిగ్ బాస్' సీజన్ 3 చూసినవారికి 'అలీ రెజా' గుర్తుంటాడు. అప్పట్లో బిగ్ బాస్ హౌస్ లో ఆయన తనదైన మార్క్ చూపించాడు. బుల్లితెర అర్జున్ రెడ్డి అనే పేరు సంపాదించుకున్నాడు. ఆ సీజన్ లో 50 రోజుల తరువాత ఆయున ఎలిమినేట్ అయ్యాడు. ఆ తరువాత మళ్లీ రీ ఎంట్రీ ఇచ్చాడు. ఆయన డబ్బు ఇచ్చి మరీ రీ ఎంట్రీ ఇచ్చాడనే ఒక రూమర్ వినిపించింది.

ఈ విషయంపై తాజాగా 'ట్రీ మీడియా'కి ఇచ్చిన ఇంటర్వ్యూలో అలీ రెజా మాట్లాడుతూ, "మా సీజన్ సమయంలో బిగ్ బాస్ పై హైప్ చాలా ఎక్కువగా ఉండేది. 50 రోజుల తరువాత నన్ను ఎలిమినేట్ చేశారు. ఆ విషయాన్ని నేను జీర్ణించుకోలేకపోయాను. నాగ్ సార్ తో స్టేజ్ పై మాట్లాడుతుంటే కూడా కన్నీళ్లు వచ్చేశాయి. హౌస్ నుంచి బయటికి వచ్చిన తరువాత నాకు ఎంత ఫాలోయింగ్ ఉందనేది అర్థమైంది" అని అన్నాడు. 

ఆ తరువాత మళ్లీ నన్ను 'బిగ్ బాస్'లోకి రమ్మని చెప్పి అడిగారు. నాకు ఇష్టం లేకపోయినా, అగ్రిమెంట్ ప్రకారం వెళ్లవలసి వచ్చింది. మా సీజన్ లో మేమంతా చిల్లర విషయాలను గురించి ఎప్పుడూ గొడవపడలేదు. గేమ్ గురించి మాత్రమే గొడవపడేవాళ్లం. నేను ఎదురు డబ్బిచ్చి మళ్లీ లోపలికి వెళ్లాననేది పుకారు మాత్రమే. బిగ్ బాస్ వలన నేను కోరుకున్న గుర్తింపు వచ్చింది. ఆ డబ్బుతో నేను ఇల్లు కొనుక్కున్నాను" అని చెప్పాడు.

Advertisement
Ali Reza
Actor
Bigg Boss3

More Telugu News