చంద్రబాబు సీఎం కావాలని యార్లగడ్డ యాగం

Yarlagadda Venkat Rao yagam for Chandrababu
  • గన్నవరం నుంచి పోటీ చేయబోతున్న యార్లగడ్డ
  • తొలి జాబితాలోనే యార్లగడ్డకు టికెట్ ఇచ్చిన చంద్రబాబు
  • ఇంకా అభ్యర్థిని ప్రకటించని వైసీపీ
ఏపీలో ఎన్నికల హడావుడి నెలకొంది. ఎన్నికల్లో విజయం సాధించాలని వైసీపీ, టీడీపీ పట్టుదలతో ఉన్నాయి. మరోవైపు చంద్రబాబు సీఎం కావాలని, గన్నవరం ప్రజలు సుఖసంతోషాలతో ఉండాలనే సంకల్పంతో గన్నవరం టీడీపీ అభ్యర్థి యార్లగడ్డ వెంకట్రావు రాజ్యలక్ష్మి, అష్టద్రవ్య మహాగణపతి, సుదర్శన లక్ష్మీ నారసింహ యాగాన్ని చేపట్టారు. నిన్న ప్రారంభమైన ఈ యాగం రేపటి వరకు కొనసాగనుంది. టీడీపీ తొలి జాబితాలోనే యార్లగడ్డకు టికెట్ లభించిన సంగతి తెలిసిందే. గన్నవరం స్థానం నుంచి తమ అభ్యర్థిని వైసీపీ ఇంకా ప్రకటించలేదు. స్థానిక ఎమ్మెల్యే వల్లభనేని వంశీపై పార్టీ ఫిరాయింపుల చట్టం కింద స్పీకర్ తమ్మినేని సీతారాం అనర్హత వేటు వేశారు.
Go Back to Shorts
Yarlagadda Venkat Rao
Chandrababu
Telugudesam
Yagam

More Telugu News