కుప్పంలో చంద్రబాబు ఓడిపోవడం పక్కా: గణాంకాలతో విజయసాయిరెడ్డి వివరణ

కుప్పంలో చంద్రబాబు ఓడిపోవడం పక్కా: గణాంకాలతో విజయసాయిరెడ్డి వివరణ

Chandrababu defeat in Kuppam is clear says Vijayasai Reddy
  • 2004లో కుప్పంలో చంద్రబాబుకు 70 శాతం ఓట్ షేర్ వచ్చిందన్న విజయసాయి
  • 2019కి 55.19 శాతానికి దిగజారిందని వెల్లడి
  • ఈసారి సొంత సీటును కూడా కాపాడుకోలేరని ఎద్దేవా
కుప్పం నియోజకవర్గంలో టీడీపీ అధినేత చంద్రబాబు ఓటమి వెరీ క్లియర్ అని వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి జోస్యం చెప్పారు. 2004లో చంద్రబాబుకు 70 శాతం ఓట్ షేర్ వచ్చిందని... 2014లో అది 62.5 శాతానికి పడిపోయిందని... 2019లో మరింత దిగజారి 55.19 శాతానికి పరిమితమయిందని తెలిపారు. 2019 ఎన్నికల్లో చంద్రబాబు కేవలం 30,722 ఓట్ల మెజార్టీతో గెలుపొందారని చెప్పారు. 2024 ఎన్నికల్లో సొంత సీటును కూడా చంద్రబాబు కాపాడుకోలేరని అన్నారు. చంద్రబాబు మళ్లీ సీఎం అవుతారనే విషయాన్ని మర్చిపోవాలని చెప్పారు. ఈ మేరకు ఆయన ఎక్స్ వేదికగా వ్యాఖ్యానించారు.
Advertisement
Vijayasai Reddy
YSRCP
Chandrababu
Telugudesam
Kuppam

More Telugu News