ఎన్నికల్లో టీడీపీకి మద్దతుగా నిలవాలని మైనార్టీ హక్కుల పరిరక్షణ సమితి ఏకగ్రీవ తీర్మానం
Advertisement

ఎన్నికల్లో టీడీపీకి మద్దతుగా నిలవాలని మైనార్టీ హక్కుల పరిరక్షణ సమితి ఏకగ్రీవ తీర్మానం

Farooq Shibli fires on ysrcp
  • విజయవాడలో మైనార్టీ హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర స్థాయి కార్యవర్గ సమావేశం
  • చంద్రబాబు పాలనలో ముస్లింల ఆత్మగౌరవానికి భంగం కలగలేదన్న ఫారుఖ్ షిబ్లీ
  • బీజేపీ నేతలకు జగన్ మోకరిల్లుతున్నారని విమర్శ
రానున్న లోక్ సభ, శాసనసభ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి మద్దతుగా నిలవాలని మైనార్టీ హక్కుల పరిరక్షణ సమితి ఏకగ్రీవంగా తీర్మానించింది. ఈరోజు విజయవాడలో మైనార్టీ హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర స్థాయి కార్యవర్గ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ముస్లిం మైనార్టీ వర్గాలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నాయి. ఈ సమావేశంలో ఏపీలో ముస్లింలపై జరుగుతున్న దాడులు, మైనార్టీల అభివృద్ధిపై నేతలు చర్చించారు. 

 ఈ సందర్భంగా సమితి అధ్యక్షుడు ఫారూఖ్ షిబ్లీ మాట్లాడుతూ... చంద్రబాబు పాలనలో ముస్లింల ఆత్మగౌరవానికి ఎక్కడా భంగం కలగలేదని చెప్పారు. సెక్యులరిజంకు మారు పేరు చంద్రబాబు అని కితాబునిచ్చారు. బీజేపీతో పొత్తులో ఉన్న సమయంలో కూడా ముస్లింల అభివృద్ధిని చంద్రబాబు విస్మరించలేదని అన్నారు. బీజేపీతో లేమంటూనే ఆ పార్టీ నేతలకు జగన్ మోకరిల్లుతున్నారని చెప్పారు. జగన్ పాలనలో ముస్లింపై 107 దాడులు జరిగాయని దుయ్యబట్టారు. ముస్లింల హక్కుల సాధన, అభివృద్ధి కోసం టీడీపీకి మద్దతిస్తున్నామని చెప్పారు.
Advertisement
Chandrababu
Telugudesam
Muslims

More Telugu News