Advertisement

నేడు కేసీఆర్ పుట్టినరోజు.. శుభాకాంక్షలు తెలిపిన హరీశ్, కవిత

Today is KCR bithday
  • కేసీఆర్ పుట్టినరోజు వేడుకలను ఘనంగా నిర్వహిస్తున్న బీఆర్ఎస్ శ్రేణులు
  • కేసీఆర్ కారణ జన్ముడన్న హరీశ్ రావు
  • అరవై ఏళ్ల స్వరాష్ట్ర ఆకాంక్షను సాకారం చేసిన నేత అన్న కవిత
బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ నేడు పుట్టినరోజును జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా ఆయన పుట్టినరోజు వేడుకలను పార్టీ శ్రేణులు ఘనంగా నిర్వహిస్తున్నాయి. బహ్రెయిన్, ఖతార్ లో కూడా బర్త్ డే వేడుకలను అభిమానులు నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే, మాజీ మంత్రి హరీశ్ రావు ఎక్స్ వేదికగా కేసీఆర్ కు శుభాకాంక్షలు తెలిపారు. కేసీఆర్ తెలంగాణ స్వాప్నికుడు, స్వరాష్ట్ర సాధకుడు, ఉద్యమ నాయకుడు అని కొనియాడారు. ప్రజల గుండెల్లో చిరకాలం నిలిచిపోయే మహనీయుడని అన్నారు. కారణ జన్ముడైన కేసీఆర్ చిరస్మరణీయుడిగా నిండు నూరేళ్లు వర్ధిల్లాలని ఆకాంక్షించారు. 

తన తండ్రికి బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత శుభాకాంక్షలు తెలిపారు. స్వయం పాలనే తెలంగాణకు శ్రీరామ రక్ష అని చాటి, అరవై ఏళ్ల స్వరాష్ట్ర ఆకాంక్షను సాకారం చేసి, తెలంగాణను దేశానికి రోల్ మోడల్ గా తీర్చిదిద్దిన తెలంగాణ తల్లి ముద్దు బిడ్డ కేసీఆర్ గారికి జన్మదిన శుభాకాంక్షలు అని ట్వీట్ చేశారు.
Advertisement
KCR
BRS
Birthday
Harish Rao
K Kavitha

More Telugu News