Lal Salaam: మతం కంటే మానవత్వం గొప్పది .. 'లాల్ సలామ్' ట్రైలర్ డైలాగ్!

Lal Salaam trailer released
షార్ట్స్‌లో చూడండి
రజనీకాంత్ కూతురు ఐశ్వర్య రజనీకాంత్ 'లాల్ సలామ్' సినిమాను రూపొందించారు. లైకా ప్రొడక్షన్స్ వారు నిర్మించిన సినిమా ఇది. విష్ణు విశాల్ - విక్రాంత్ ప్రధానమైన పాత్రలను పోషించిన ఈ సినిమాలో, రజనీకాంత్ ఒక కీలకమైన పాత్రలో కనిపించనున్నారు. ఆ పాత్ర పేరే మొయిద్దీన్ భాయ్.

ఈ సినిమాను ఈ నెల 9వ తేదీన విడుదల చేయనున్నారు. ఈ నేపథ్యంలో ఈ సినిమా నుంచి ట్రైలర్ ను వదిలారు. ప్రధానమైన పాత్రలను కవర్ చేస్తూ కట్ చేసిన ఈ ట్రైలర్, ఆకట్టుకునేలా ఉంది. 'మతం కంటే మానవత్వం గొప్పది' అంటూ రజనీ చెప్పిన డైలాగ్ ఈ ట్రైలర్ కి హైలైట్.

రజనీ లుక్ .. ఆయన స్టైల్ ప్రత్యేక ఆకర్షణగా కనిపిస్తున్నాయి. చాలా కాలం తరువాత ఆయనకి సాయికుమార్ డబ్బింగ్ చెప్పడం విశేషం. ఒక వైపున గ్రామీణ రాజకీయాలు .. మరో వైపున క్రికెట్ నేపథ్యం చుట్టూ తిరిగే ఈ కథలో, కపిల్ దేవ్ అతిథి పాత్రలో కనిపించనున్నాడు. 
Go Back to Shorts
Lal Salaam
Rajanikanth
Vishnu Vishal
Vikranth

More Telugu News