పాక్‌లో వరుస బాంబు పేలుళ్లు.. ఎన్నికలకు వారమే ఉన్న నేపథ్యంలో కలకలం
- శుక్రవారం ఎన్నికల ప్రధాన కార్యాలయం సమీపంలో పేలుడు
- బలొచిస్థాన్, ఖైబర్ పాఖ్తూన్‌ఖ్వా ప్రావిన్సుల్లో మితిమీరుతున్న ఉగ్రదాడులు
- పోలీస్ స్టేషన్లే టార్గెట్‌గా వరుస బాంబు పేలుళ్లు
కాగా, బలొచిస్థాన్ ప్రావిన్స్‌లో గురువారం వరుస బాంబు పేలుళ్లు చోటుచేసుకున్నాయి. పోలీస్ స్టేషన్లు, డిప్యూటీ కమిషనర్ల కార్యాలయాలే టార్గెట్‌గా మొత్తం 10 చోట్ల పేలుళ్లు సంభవించాయి. ఈ ఘటనల్లో ఒకరు మరణించగా ఆరుగురు గాయపడ్డారు. గాయపడ్డ వారిలో ఒక పోలీసు అధికారి, జైలు వార్డెన్ ఉన్నారు. ఇక కెట్టాలోని స్పిన్నీ ప్రాంతంలో చైనా పాక్ ఎకనమిక్ కారిడార్ రహదారి ఫుట్‌పాత్‌పై అమర్చిన బాంబు పేలడంతో ఓ పాదచారి మరణించినట్టు కెట్టా స్పెషల్ ఆపరేషన్స్ పోలీసులు తెలిపారు.
ఎన్నికలకు వారం రోజులే ఉన్న తరుణంలో పాక్‌లో హింస ప్రజ్వరిల్లుతోంది. ఆప్ఘనిస్థాన్ సరిహద్దున ఉన్న ఖైబర్ పాఖ్తూన్‌ఖ్వా ప్రావిన్సుల్లో టెర్రరిస్టులు దాడులకు తెగబడుతున్నారు.