అందం తెచ్చిన కీర్తి కిరీటం .. కీర్తి సురేశ్ లేటెస్ట్ పిక్స్!
Add ap7am to your home Screen

అందం తెచ్చిన కీర్తి కిరీటం .. కీర్తి సురేశ్ లేటెస్ట్ పిక్స్!

Keerthi Suresh Special
  • తెలుగు .. తమిళ భాషల్లో కీర్తి సురేశ్ జోరు 
  • క్రితం ఏడాది రెండు హిట్లు కొట్టిన బ్యూటీ 
  • ప్రస్తుతం తమిళ సినిమాలతో బిజీ
  • ఎల్లో చీరకట్టులో ఎల్లోరా శిల్ప దర్శనం

చైల్డ్ ఆర్టిస్టుగా కెరియర్ ను మొదలుపెట్టి, ఆ తరువాత స్టార్ హీరోయిన్ గా ఎదిగినవారి జాబితాలో శ్రీదేవి .. మీనా తరువాత స్థానంలో కీర్తి సురేశ్ కనిపిస్తుంది. మలయాళ సినిమాతో తన కెరియర్ ను మొదలుపెట్టిన కీర్తి సురేశ్, ప్రస్తుతం తెలుగు .. తమిళ .. మలయాళ సినిమాలతో బిజీగా ఉంది. నేను .. శైలజ, నేను లోకల్ .. మహానటి వంటి హిట్ సినిమాలు ఆమె కెరియర్లో ఉన్నాయి. కీర్తి సురేశ్ నటనకి స్కోప్ ఉన్న పాత్రలను ఎక్కువగా ఎంచుకుంటూ ముందుకు వెళుతోంది. క్రితం ఏడాది ఆమె చేసిన సినిమాలలో, తమిళంలో 'మా మన్నన్' .. తెలుగులో 'దసరా' ఆమెకి భారీ విజయంతో పాటు ప్రశంసలను తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఆమె చేతిలో నాలుగు తమిళ సినిమాలు .. ఒక హిందీ మూవీ ఉన్నాయి. తాజాగా కీర్తి సురేశ్ నుంచి వచ్చిన ఫొటోస్ ను చూస్తే, ఆమె మరింత అందంగా కనిపిస్తోంది. లైట్ ఎల్లో కలర్ డ్రెస్ లో ఎల్లోరా శిల్పంలా మెరిసిపోతోంది. అప్పుడే విరిసిన గుమ్మడిపువ్వును గుర్తుచేస్తోంది. సినిమా .. సినిమాకి కీర్తి సురేశ్ అభిమానుల సంఖ్య పొలోమంటూ పెరిగిపోవడానికి కారణమేమిటనేది ఈ ఫొటోస్ చూస్తేనే అర్థమైపోవడం లేదూ!
Advertisement
Keerthi Suresh
Actress
Kollywood

More Telugu News