Jagan: జగన్ బావమరిదికి రెండు చోట్ల ఓటు ఉన్నా చర్యలు తీసుకోవడం లేదు: చాపాటి ప్రభాకర్ రెడ్డి

Jagan brother in law Ramanjulu Reddy has two votes
షార్ట్స్‌లో చూడండి
జగన్ మేనమామ, ఎమ్మెల్యే రవీంద్రనాథ్ రెడ్డి కుమారుడు నరేన్ రామాంజులు రెడ్డికి రెండు చోట్ల ఓటు హక్కు ఉందని తెలుగు యువత కడప జిల్లా అధ్యక్షుడు చాపాటి ప్రభాకర్ రెడ్డి ఆరోపించారు. కమలాపురంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ... రామాంజులరెడ్డికి కమలాపురంలోని 29వ కేంద్రంలో వరుస సంఖ్య 35 ఆర్సీఆర్ 1376680 నెంబర్ తో ఒక ఓటు... చెన్నూరులోని 71వ కేంద్రంలో వరుస సంఖ్య 795 ఆర్సీఆర్ 1411107 నెంబర్ తో మరో ఓటు ఉందని తెలిపారు. 

దీనిపై ఈఆర్వో, తహసీల్దార్, బీఎల్వోలకు ఫిర్యాదు చేసినా తొలగించలేదని ప్రభాకర్ రెడ్డి మండిపడ్డారు. ఈ విషయాన్ని ఎన్నికల సంఘం దృష్టికి తీసుకెళ్తామని చెప్పారు. మరోవైపు రామాంజులు రెడ్డి సీకే దిన్నె జడ్పీటీసీ సభ్యుడిగా ఉన్నారు. 
Go Back to Shorts
Jagan
Btother in law
Ramanjulu Reddy
Two Votes
Kamalapuram
YSRCP
Telugudesam

More Telugu News