అందానికి పెట్టిన పేరు మీనాక్షి .. లేటెస్ట్ పిక్స్!

Meenakshi Chaudhary Special
  • 'ఖిలాడి' సినిమాతో దక్కిన గుర్తింపు 
  • 'గుంటూరు కారం'లో మెరిసిన గ్లామర్ 
  • చేతిలో తెలుగు .. తమిళ సినిమాలు
  • త్వరలోనే కెరియర్ గ్రాఫ్ పుంజుకునే ఛాన్స్

ఈ మధ్య కాలంలో తెలుగు తెరకి పరిచయమైన కథానాయికలలో మీనాక్షి చౌదరి ఒకరు. 'ఇచ్చట వాహనములు నిలుపరాదు' సినిమాతో ఈ హర్యానా బ్యూటీ టాలీవుడ్ కి పరిచయమైంది. ఆ తరువాత రవితేజ సరసన ఆమె చేసిన 'ఖిలాడి' .. అడవి శేష్ జోడీకట్టిన 'హిట్ : ది సెకండ్ కేస్' సినిమాలు మంచి గుర్తింపు తెచ్చిపెట్టాయి.రీసెంటుగా మీనాక్షి కనిపించిన సినిమా 'గుంటూరు కారం'. ఈ సినిమాలో ఆమె పాత్రకి పెద్దగా ప్రాధాన్యత లేదు .. నటనకి ఎలాంటి స్కోప్ లేదు. కానీ మునుపటి కంటే అందంగా కనిపిస్తూ అందరి చూపులను తనవైపుకు తిప్పుకుంది. ఆమె వైపు నుంచి మహేశ్ తో ఒక పాట పెడితే బాగుండేదని అభిప్రాయాలను చాలామంది వ్యక్తం చేశారు. ప్రస్తుతం ఆమె చేతిలో రెండు మూడు తెలుగు సినిమాలతో పాటు, రెండు తమిళ సినిమాలు కూడా ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఆమె ఫొటో షూట్ కి సంబంధించిన పిక్స్ ఆకట్టుకుంటున్నాయి. నీలంరంగు చీరకట్టులో అందం చెక్కిన శిల్పంలా కనిపిస్తూ, చక్కని చిరునవ్వుతో ఊహల ఉద్యానవనానికి తీసుకెళుతోంది. మీనాల్లాంటి కళ్లతోనే అందానికి అసలైన నిర్వచనం చెబుతోంది.
Advertisement
Meenakshi Chaudhary
Actress
Khiladi

More Telugu News