Junior NTR: జూనియర్ ఎన్టీఆర్ అయోధ్యకు వెళ్లకపోవడానికి కారణం ఇదే!

This is the reason why Junior NTR not sent to Ayodhya
షార్ట్స్‌లో చూడండి
అయోధ్య రామ మందిరంలో బాల రాముడి విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం నిన్న అంగరంగ వైభవంగా జరిగింది. స్వామి వారికి ప్రధాని మోదీ తొలి పూజను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి దేశ వ్యాప్తంగా ఉన్న వివిధ రంగాల అతిరథ మహారథులంతా తరలి వచ్చారు. 7 వేలకు పైగా వీవీఐపీలు హాజరయ్యారు. ఆలయ ప్రాంగణం సినీ సెలబ్రిటీలతో కళకళలాడింది. టాలీవుడ్ స్టార్ జూనియర్ ఎన్టీఆర్ కు కూడా ఆహ్వానం అందినప్పటికీ... ఆయన అయోధ్యకు వెళ్లలేదు. దీంతో, ఆయన ఎందుకు వెళ్లలేదనే చర్చ జరుగుతోంది. 

అయితే, 'దేవర' సినిమా షూటింగ్ బిజీ వల్లే ఆయన అయోధ్యకు వెళ్లలేదని చెపుతున్నారు. షూటింగ్ షెడ్యూల్ ముందే ఫిక్స్ అయిపోవడంతో తారక్ వెళ్లలేకపోయారట. షెడ్యూల్ ని తారక్ బ్రేక్ చేస్తే... తోటి నటీనటులతో పాటు, నిర్మాతలు ఇబ్బంది పడాల్సి ఉంటుందనే ఉద్దేశంతోనే తారక్ అయోధ్యకు వెళ్లలేకపోయారని అంటున్నారు. అయితే, ఈ వార్తల్లో ఎంత వరకు నిజం ఉందనేది తెలియాల్సి ఉంది.
Go Back to Shorts
Junior NTR
Tollywood
Ayodhya

More Telugu News